Namaste NRI

గుర్తుందా శీతాకాలం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సత్యదేవ్‌, తమన్నా జంటగా నటించిన సినిమా గుర్తుందా శీతాకాలం. కావ్య శెట్టి, మేఘా ఆకాష్‌, ప్రియదర్శి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగశేఖర్‌ మాట్లాడుతూ మనమంతా జీవితంలో ఏదో ఒక సమయంలో స్థిరపడతాం. అప్పటికి వయసులో ఓ దశకు చేరుకుంటాం. ఈ ప్రయాణమంతా మనకు టీనేజ్‌ లవ్‌, ఇతర సందర్భాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ ప్రేమ కథల సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రంతో ప్రేక్షకులు మరోసారి తమ జ్ఞాపకాల్లోకి వెళ్తారు. ప్రేమ, వినోదం వంటి అంశాలు ఆకట్టుకుంటాయి అన్నారు. కన్నడ హిట్‌ ఫిల్మ్‌ లవ్‌ మాక్‌ టైల్‌ ఆధారంగా దర్శకుడు నాగశేఖర్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భావన రవి, నాగశేఖర్‌, రామారావు చింతపల్లి, ఎమ్‌.ఎస్‌.రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రాన్ని జులై 15న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: సత్యహెగ్డే, సంగీతం: కాలభైరవ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events