Skip to main content

Namaste NRI

రాబిన్ హుడ్‌ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. నితిన్, శ్రీలీల స్టైలిష్ గా

నితిన్‌, శ్రీలీల జంటగా రూపొందుతోన్న చిత్రం రాబిన్‌ హుడ్‌. వెంకీ కుడుముల దర్శకుడు. ప్రతిష్టాత్మ మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేశారు. లుక్‌ ఇస్తే చాలే జానూ.. లక్కీగా ఫీలవుతాను.. కిక్కొచ్చే టచ్‌ ఇస్తావా వన్‌మోర్‌ టైమ్‌.. వన్‌మోర్‌ టైమ్‌ అంటూ సాగే ఈ పాటను కృష్ణకాంత్‌ రాయగా, జీవి ప్రకాష్‌కుమార్‌ స్వరపరిచి, విద్యా వోక్స్‌తో కలిసి ఆలపించారు.

ప్రేమకోసం గర్ల్‌ఫ్రెండ్‌ని మరో అవకాశం కోరుతూ హీరో పాడే పాట ఇదని, హీరోలోని నిజాయితీని మెచ్చుకుం టూనే, కాస్త జాగ్రత్తగా ఉండమని హీరోయిన్‌ హెచ్చరించడం ఈ పాటలో ప్రత్యేకత అని, నితిన్‌, శ్రీలీల అద్భు తమైన కెమిస్ట్రీ, అట్రాక్టివ్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఈ పాటలో హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్‌ తెలిపారు. రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events