Skip to main content

Namaste NRI

డైరెక్టర్ వేణు లాంచ్ చేసిన రాకింగ్ రాకేష్ కేశవ చంద్ర రమావత్ (కెసిఆర్) రిలీజ్ డేట్ పోస్టర్

జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేష్‌ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న చిత్రం కేశవ చంద్ర రమావత్‌ (కేసీఆర్‌). అనన్య కృష్ణన్‌ కథానాయిక.  గరుడవేగ అంజి దర్శకత్వం. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను నటుడు, దర్శకుడు బలగం వేణు విడుదల చేశారు. ఓ లంబాడీ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తిపొంది ఈ సినిమాను తెరకెక్కించాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి అభిమాని కథగా అందరినీ ఆకట్టుకుంటుంది.  తెలుగు రాష్ర్టాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, ధనరాజ్‌, తాగుబోతు రమేష్‌, జోర్దార్‌ సుజాత, లోహిత్‌ కుమార్‌, రచ్చ రవి తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంభాషణలు: రాజ్‌కుమార్‌ కుసుమ, సంగీతం: చరణ్‌అర్జున్‌, స్క్రీన్‌ప్లే, రచన, నిర్మాత: రాకింగ్‌ రాకేష్‌, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: ‘గరుడవేగ’ అంజి.

Social Share Spread Message

Latest News