Namaste NRI

ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ ఖరారు

ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం) విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా జవనరి 7, 2022న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. జూ.ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. కీరణవాణి స్వరాలు అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ. దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ భామ అలియా భట్‌ నాయికగా నటిస్తోంది. హాలీవుడ్‌ నటి ఒభీలియా మరో నాయిక. అజయ్‌ దేవగణ్‌ మరో ముఖ్య పాత్రధారి. పాన్‌ ఇండియా స్థాయిలో రూ.400 కోట్లతో రూపొందిన ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News