హైదరాబాద్‌కు చెందిన టీ శ్వేతారెడ్డి (17) ప్రపంచ ప్రఖ్యాత రూ.2 కోట్ల డయర్ (డిజైనింగ్ యువర్ ఆంత్రప్రెన్యూరియల్ రోడ్ మ్యాప్) ఫెలోషిప్‌నకు ఎంపికైంది. అమెరికాలోని ప్రముఖ 25 కాలేజీల్లో ఒకటైన లాఫాయెట్‌లో అడుగుపెట్టబోతున్నది. ఆమెతో పాటు ఈ ఫెలోషిప్‌నకు ఆరుగురే ఎంపికయ్యారు. లాఫాయెట్ కాలేజీ లో ఈమె బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువబోతున్నది. పాఠశాల స్థాయిలో కనబర్చిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, వలంటీర్ సేవలు, అసక్తి, గతంలో ఎదురైన అవరోధాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై స్వీయ అనుభవాలతో సమాధానాలు రాసి పంపించాల్సి ఉంటుంది. వాటన్నింటికి శ్వేతారెడ్డి తనదైన శైలిలో సమాధానలిచ్చింది. వాటిని పరిశీలించిన యాజమాన్యం డయర్ ఫెలోఫిప్‌నకు ఎంపిక చేసింది.