శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం రుద్రవీణ. ఈ చిత్ర ప్రీలుక్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథులుగా ప్రీలుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ చిరంజీవి నటించి రుద్రవీణ విడుదలైనప్పుడే నేను పుట్టాను. ఆ పేరుతో విభిన్నమైన ఓ మంచి యాక్షన్ చిత్రం తీయాలని ప్రతీకారం నేపథ్యంలో ఈ కథ రాసుకున్నా. ప్రతీకార కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. కథానుగుణంగా చక్కటి సంగీతం కుదిరింది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ చిరంజీవి అంటే నాకు సెంటిమెంట్. నా మొదటి సినిమా ఆయన నటించిన రుద్రవీణ పేరుతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. సహజత్వానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీస్తే తప్పకుండా సినిమాలు విజయవంతం అవుతాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఈ సినిమాలో తాను విలన్‌గా నటించానని రఘు కుంచె తెలిపారు. మధుసూదన్‌రెడ్డి దర్శకుడు. రాగుల లక్ష్మణ్, శ్రీను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తియింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతాని రామకృష్ణగౌడ్ చిత్రంలో విలన్‌గా నటించిన రఘు కుంచెతో పాటు చలాకీ చంటి, శ్రీను, మహావీర్, రాంబాబు గోసాల తదితరులు పాల్గొన్నారు.














