Skip to main content

Namaste NRI

రష్యా కీలక నిర్ణయం

పశ్చిమ ప్రాంతంలో ఒక పక్క తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ అణు పరీక్షల నిషేధ ఒప్పందం రద్దు బిల్లుకు ఆ దేశ పార్లమెంట్‌ తాజాగా ఆమోదం తెలిపింది. అణ్వాయుధ పరీక్షల్ని నిషేధించే అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదిస్తూ 2000 ఏడాదిలో చేసిన తీర్మానాన్ని తమ పార్లమెంట్‌ రద్దు చేసే అవకాశాలు న్నాయని ఇటీవల పుతిన్‌ వెల్లడించారు. అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందంపై అమెరికా సంతకం చేసిన ప్పటికీ ఆ దేశ కాంగ్రెస్‌ ఇప్పటికీ ఆమోదించలేదని ఆయన గుర్తుచేశారు. తాము కూడా ఆ తరహాలోనే నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు.

Social Share Spread Message

Latest News