ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందిస్తామన్న అమెరికా ప్రకటనపై రష్యా స్పందించింది. యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం అందిస్తే తీవ్రమైన పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని రష్యా హెచ్చరించినట్లు తెలిసింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపిస్తామన్న జో బైడెన్ ప్రకటనపై రష్యా, అమెరికా, నాటోను తీవ్రంగా వ్యతిరేకించింది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ సాయం చేస్తే అనూహ్యమైన పరిణామాలు నెలకొంటాయని హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్‌కు రూ.80 కోట్ల హెలికాప్టర్లు, హెలిట్జర్లు సాయుధ సిబ్బంది క్యారియర్లను సాయంగా అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే అమెరికాను రష్యా హెచ్చరించడం గమనార్హం.














