Skip to main content

Namaste NRI

జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలకు రష్యా వార్నింగ్‌

ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. శత్రుదేశంతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు ఆయుధాల సరాఫరాను పెంచవద్దని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌లకు వార్నింగ్‌ ఇచ్చాడు. చెప్పిన మాట వినకుండా ఆయుధాలు సరాఫరా చేస్తే పాశ్యాత్య దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించాడు. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ప్రమాదకరమని, దీని ద్వారా మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.

Social Share Spread Message

Latest News