Namaste NRI

భారత్‌లో రష్యా పెట్టుబడులు.. త్వరలో ఒప్పందం

ర‌ష్యాతో భారీ ర‌క్ష‌ణ ఒప్పందం కుదుర్చుకోనున్న‌ది భార‌త ప్ర‌భుత్వం. సుమారు 4 బిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌రీదైన ఆ ఒప్పందం తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రేడార్ వ్య‌వ‌స్థ‌ ను ర‌ష్యా నుంచి భార‌త్ కొనుగోలు చేయ‌నున్న‌ది. ఆ ఒప్పందానికి చెందిన సంప్ర‌దింపులు అడ్వాన్స్‌డ్ ద‌శ‌లో ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అల్మాజ్‌-ఆంటే కార్పొరేష‌న్ కంపెనీ వోరోనేజ్ రేడార్‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్‌, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్ట‌మ్స్‌, రేడార్ల ఉత్ప‌త్తిలో ఆ సంస్థ అగ్ర‌స్థానంలో ఉన్న‌ది. అయితే మిస్సైల్ బెదిరింపుల్ని గుర్తించి, ట్రాక్ చేసేందుకు సామ‌ర్థ్యాన్ని పెంచుకోవాల‌ని భార‌త్ భావిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిప‌ణుల క‌ద‌లిక‌ల్ని రేడార్ల‌తో ప‌సిక‌ట్టేందుకు ఈ కొనుగోలు చేప‌ట్ట‌నున్నారు. దాదాపు 8 వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిప‌ణులు, విమానాల‌ను వోరోనేజ్ రేడార్ వ్య‌వ‌స్థ గుర్తిస్తుంద‌ని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వ‌ద్దే ఉన్న ఇలాంటి టెక్నాల‌జీని ఇప్పుడు భార‌త్ కూడా సొంతం చేసుకోనున్న‌ట్లు ర‌ష్యా చెబుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events