ఎస్-400 సిమ్యులేటర్లు, పరికరాలను భారత్కు రష్యా సరఫరా చేసింది. భారీ ఎయిర్ డిఫైన్స్ క్షిపణి వ్యవస్థ రెండో స్క్వాడ్రన్గా ట్రైనింగ్ స్క్వాడ్రన్ ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందులో కేవలం శిక్షణకు సంబంధించిన సిమ్యులేటర్లు, పరికరాలు మాత్రమే ఉంటాయని రక్షణ వర్గాలు తెలిపాయి. క్షిపణులు లేదా లాంఛర్లు ఈ ట్రైనింగ్ స్క్వాడ్రన్లో ఉండవని పేర్కొన్నాయి. ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఆయుధాల సరఫరాపై ఇది ప్రభావం చూపవచ్చన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒప్పందం మేరకు రష్యా నుంచి ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు, పరికరాలు సరఫరా అవుతున్నాయి. ఇందులోష్ట్రÊ భాగంగా తాజాగా ఎన్`400 సిమ్యులేటర్లు, పరికరాలను రష్యా నుంచి సముద్ర మార్గంలో అందుకున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ సరఫరా ఇంకా కొనసాగుతుందని, ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదని వెల్లడిరచాయి.














