విశ్వంత్ కథానాయకుడిగా బసిరెడ్డి రానా దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. నరేంద్ర బుచ్చి రెడ్డి గారి నిర్మిస్తున్నారు. శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ కథానాయికలు. సహస్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెం 1తో రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బొమ్మిరిల్లు భాస్కర్ క్లాప్ కొట్టారు. సుద్దాల అశోక్ తేజ కెమెరా స్విచ్చాన్ చేశారు. సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెడుతోంది. ఈ నెల 14 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. హైదరాబాద్, కర్నూల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్‌ను త్వరలో విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: లిజో కె. జోష్, ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి.














