Skip to main content

Namaste NRI

దుబాయ్‌లో ఘనంగా సైమా అవార్డ్స్ వేడుకలు

దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా 2025)  వేడుక ఈ ఏడాది దుబాయ్ వేదికగా అత్యంత అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తమిళం, మలయాళం చిత్ర పరిశ్రమలకు సంబంధించిన న‌టీనటుల‌కి పురస్కారాలు అందించారు. దక్షిణాది సినీ పరిశ్రమల ప్రముఖులు, దర్శకులు, నటీనటులు పెద్ద ఎత్తున హాజరై వేడుకను మరింత రక్తికట్టించారు. కోలీవుడ్ (తమిళం) విభాగంలో ఉత్తమ చిత్రంగా అమరన్ ఎంపికైంది. ఇదే చిత్రానికి గాను సాయి ప‌ల్ల‌వికి ఉత్త‌మ న‌టి అవార్డ్ ద‌క్కింది. మాలీవుడ్ (మలయాళం) విభాగంలో ఉత్తమ చిత్రంగా మంజుమ్మల్ బాయ్స్  ఎంపికైంది.

ఇక ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ ( సినిమాకుగానూ) అవార్డ్ అందుకున్నారు. సినీ రంగానికి దశాబ్దాల పాటు సేవలు అందించిన నటుడు శివకుమార్‌కి ప్ర‌త్యేక అవార్డ్ అందించారు. అలానే పలు భాషల్లో మెరిసిన ప్రముఖ నటి త్రిషకు ప్రత్యేక గౌరవ పురస్కారాలు అందించారు. ఈ అవార్డ్స్ వేడుకలో రెడ్ కార్పెట్‌పై విభిన్నమైన డిజైనర్ ఔట్‌ఫిట్స్‌తో మెరిసిన నటి నటులు, ప్రదర్శించిన లైవ్ పెర్ఫార్మెన్స్‌లు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  సైమా  2025 మొదటి రోజు కార్యక్రమం తెలుగు, క‌న్న‌డ‌ పరిశ్రమలకి సంబంధించిన ప్ర‌ముఖుల మ‌ధ్య జ‌రిగింది. ఆ త‌ర్వాతి రోజు త‌మిళం, మ‌ల‌యాళం విభాగాలకు సంబంధించిన అవార్డులు ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events