తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామానికి చెందిన పడిదల సాంబయ్య అనే యువకుడు ముంబైలో ప్రముఖ నటుడు సోనూసూద్‌ను కలిశాడు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడైన సాంబయ్య ఎలాగైనా సోనూను కలవాలనుకున్నారు. దీంతో గత నెల 17న కాలినడకన ముంబైకి బయలుదేరారు. దాదాపు 1,050 కిలోమీటర్ల నడిచి ముంబైలోని ఫిలిం టవర్ వద్ద సోనూసూద్‌ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సోనూను కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సాంబయ్య తెలిపారు.