Skip to main content

Namaste NRI

సర్కారు నౌకరి ట్రైలర్ రిలీజ్

ఆకాశ్‌, భావన జంటగా న‌టిస్తున్న చిత్రం సర్కారు నౌకరి. గంగనమోని శేఖర్‌ దర్శకుడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ప్రఖ్యాత దర్శకుడు రాఘవేంద్రరావు  మాట్లాడుతూ నేను పరిచయం చేసిన వెంకటేశ్‌, మహేశ్‌, తారక్‌ గొప్ప పొజిషన్‌లో ఉన్నారు. ఇప్పుడు సర్కారు నౌకరి తో గాయని సునీత కుమారుడు ఆకాశ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాను. తను కూడా పెద్ద హీరోగా నిలబడాలి అంటూ ఆకాంక్షించారు.  దర్శకుడు శేఖర్‌ తీసిన పంచతంత్ర కథలు నచ్చి పిలిచిమరీ అవకాశం ఇచ్చాను.సర్కారు నౌకరి నా తరహా సినిమా కాదు. ఇది భావోద్వేగాలతో కూడిన ప్రయాణం  అని కె.రాఘవేంద్రరావు చెప్పారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ మంచి పేరు రావాలని గాయని సునీత ఆకాంక్షించారు. హీరోహీరోయిన్లు అద్భుతంగా నటించారని, సాంకేతికంగా అందరూ బాగా సహకరించారని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్‌తో పాటు శేఖర్‌ కమ్ముల, అనీల్‌ రావిపూడి, వి.ఎన్‌.ఆదిత్య, బి.వి.ఎస్‌.ఎన్‌.రవి తదితరులు కూడా మాట్లాడారు. జనవరి 1న చిత్రం విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News