Skip to main content

Namaste NRI

సత్య, రితేష్‌ రానా టైటిల్‌ జెట్లీ ..టైటిల్ పోస్టర్ రిలీజ్

హాస్య నటుడు సత్య నటిస్తున్న తాజా చిత్రానికి జెట్లీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రితేష్‌ రానా దర్శకత్వం. యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో సత్య ఓ విమానంపై కూర్చొని కనిపిస్తున్నారు. ఐయామ్‌ డన్‌ విత్‌ కామెడీ అనే క్యాప్షన్‌ కథలోని వినోదాన్ని సూచిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నదని, హైవోల్టేజ్‌ హ్యూమర్‌, థ్రిల్స్‌, ట్విస్టులతో ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుందని, సత్య పాత్ర నవ్వుల్ని పంచుతుందని మేకర్స్‌ తెలిపారు. రియాసింఘా, వెన్నెల కిషోర్‌, అజయ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ సమర్పిస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events