Skip to main content

Namaste NRI

రౌద్ర‌రూపాయ న‌మ నుండి సెకండ్ లిరిక‌ల్ వీడియో సాంగ్ లాంచ్

బాహుబలి ప్రభాకర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం  రౌద్ర రూపాయ నమ. పాలిక్‌ దర్శకత్వంలో రావుల రమేష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సెకండ్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ తళుకు తళుకుమను తారా కులుకులొలుకు సితారా ను సాయికుమార్‌ ఆవిష్కరించారు. సురేష్‌ గంగుల రచించిన ఈ పాటను జాన్‌ భూషణ్‌ స్వరపరిచారు. ఈ సందర్భంగా సాయికుమార్‌ మాట్లాడుతూ టైటిల్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. సినిమాలోని రెండు పాటలను చూశాను. చాలా బాగున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయం సాధించాలి  అన్నారు. విభిన్న కథాంశంతో యాక్షన్‌ ప్రధానంగా చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు తెలిపారు.

న‌టుడు ర‌ఘు మాట్లాడుతూ గొప్ప న‌టుడైన‌ సాయి కుమార్ గారి చేతుల మీదుగా మా చిత్రంలోని పాట లాంచ్ చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. మంచి మెలోడీ పాట అంద‌రికీ న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అన్నారు.  మోహ‌న సిద్ధి మాట్లాడుతూ మా చిత్రంలోని సెకండ్ లిర‌క‌ల్ వీడియో లాంచ్ చేసిన సాయి కుమార్ గారికి ధ‌న్య‌వాదాలు. ఈ పాట‌ను స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో రైటర్ తోటపల్లి సాయినాథ్,చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events