Skip to main content

Namaste NRI

శ్రీవిష్ణు సింగిల్ సినిమా నుంచి.. రెండో  సాంగ్ రిలీజ్

హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న కామెడీ ఎంటైర్టెనర్‌ సింగిల్‌. ఇవానా, కేతిక శర్మ కథానాయికలు. కార్తీక్‌రాజు దర్శకుడు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్‌, రియాజ్‌చౌదరి నిర్మాతలు. ఈ సందర్భంగా మేకర్స్‌ ఈ సినిమాకు చెందిన రెండో పాటను విడుదల చేశారు. జానీ జానీ ఎస్‌ పాపా జగమంతా జంటలే నేను తప్ప,  నేనే నంబర్‌వన్‌ ఎర్రిపప్పా, ప్రేమించానంటమే పెద్ద తప్పా అంటూ సాగే ఈ పాటకు ఫ్రస్టేషన్‌ యాంథమ్‌గా మేకర్స్‌ పేరుపెట్టారు.

రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను విశాల్‌చంద్రశేఖర్‌ స్వరపరచగా, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్‌లపై ఈ పాట చిత్రీకరించారు. హీరో ఒంటరితనాన్ని వినోదంతో జోడించి ఈ పాట ద్వారా చెప్పడం జరిగిందని మేకర్స్‌ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి మాటలు: భాను భోగవరపు, నందు సవిరిగాన, కెమెరా: ఆర్‌.వెల్‌రాజ్‌, సమర్పణ: అల్లు అరవింద్‌, నిర్మాణం: గీతా ఆర్ట్స్‌, కళ్యా ఫిల్మ్స్‌.

Social Share Spread Message

Latest News