అఫ్గాన్‌లో పరిణామాలపై రష్యా మండలి కార్యదర్శి నికొలాయ్ పాట్రుషెవ్ ఢల్లీిలో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోభాల్‌తో తొలుత భేటీ అయిన వివిధ అంశాలపై చర్చించిన నికొలాయ్, ఆ తర్వాత జైశంకర్‌తో, చివరిగా ప్రధానితో సమావేశమయ్యారు. తాలిబన్ల పాలనలోని అఫ్గాన్ నుంచి ప్రాంతీయంగా తలెత్తడానికి అవకాశం ఉన్న భద్రతపరమైన ముప్పు గురించి వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చింది. ద్వైపాక్షిక చర్చల నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను భారత్‌లో ఆహ్వానించేందుకు తాను ఎదురు చూస్తుంటానని మోదీ చెప్పినట్లు తెలిసింది. అఫ్గాన్ విషయంలో భారత్, రష్యాలు కలిసి పనిచేయడం ముఖ్యమని పుతిన్ ఇటీవల మోదీతో టెలిఫోన్ ద్వారా జరిపిన చర్చల్లో పేర్కొన్నారు. దానికి కొనసాగింపుగా నికొలాయ్ మన దేశంలో పర్యటనకు వచ్చారు.