Namaste NRI

వాళ్లు కూడా మరోసారి ఇంట్లో క  చూడండి : కిరణ్‌ అబ్బవరం

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం క. దర్శక ద్వయం సుజీత్‌. సందీప్‌ దర్శకత్వంలో చింతా గోపాల కృష్ణారెడ్డి నిర్మించిన క చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అలాగే విడుదలైన అన్ని భాషల్లో సినిమా మంచి వసూళ్లు రాబట్టిందని మేకర్స్‌ ఆనందం వెలిబుచ్చారు. ఈ సంద ర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన క బ్లాక్‌బస్టర్‌ ధమాకా ఈవెంట్‌లో కిరణ్‌ అబ్బవరం మాట్లాడారు. క  సినిమాకు మేం ఎంత ప్రమోషన్‌ చేశామో, ఈటీవీ విన్‌ వాళ్లు అంత ప్రమోషన్‌ చేసి, పైరసీ అనేది జరగకుండా జాగ్రత్తగా సినిమాను ప్రతి ఒక్కరి ఇంటికి చేర్చారు. డాల్బీ విజన్‌ 4కే, అట్మాస్‌ టెక్నాలజీ నుంచి ఓటీటీకి వచ్చిన తొలి తెలుగు సినిమా క నే కావడం విశేషం. అందుకు ఈటీవీ విన్‌ టీమ్‌కి థాంక్స్‌ చెప్పుకుంటున్నా. థియేటర్లో చూసిన వాళ్లు కూడా మరోసారి ఇంట్లో క  చూడండి. ఎందుకంటే సెకండ్‌ టైమ్‌ ఇంకా బాగా అనిపించిందని చూసిన వాళ్లు చెబుతున్నారు అని అన్నారు. ఓటీటీలో కూడా క కు మంచి ఆదరణ లభిస్తుండటం పట్ల దర్శకులు సుజీత్‌, సందీప్‌ ఆనందం వెలిబుచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events