అమెరికా మాత్రం కొన్ని దేశాల్లో తిరుగుబాట్లను ప్రోత్సహించి, వాటికి ప్లాను కూడా ఇచ్చిందని అమెరికా మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టాన్ వెల్లడిరచారు. గతేడాది జనవరి 6న జరిగిన క్యాపిటోల్ ఉద్రిక్తతలను సంబంధించి ఓ కార్యక్రమంలో బోల్టాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాల్లో తిరుగుబాట్లను ప్లాన్ చేసిన వాడిగా చెప్తున్నా, అలా చెయ్యడానికి చాలా అంటే చాలా కష్టపడాలి అని తెలిపారు. జనవరి 6న జరిగింది తిరుగుబాటో, ప్రజాస్వామ్య మీద దాడో కాదని తేల్చిన ఆయన ట్రంప్ తనను తాను కాపాడుకోవడానికి, మరింత టైం సంపాదించుకోవడానికి చేసిన ప్రయత్నమని తేల్చేశారు.














