Skip to main content

Namaste NRI

రామ్‌ సినిమాలో బుల్లెట్‌ సాంగ్‌ పాడిన శింబు

రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం  ది వారియర్‌. కృతి శెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని బుల్లెట్‌ అనే ప్రత్యేక గీతాన్ని నటుడు శింబుతో పాడిరచారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌. ఇప్పటికే పాట రికార్డింగ్‌ పూర్తయిందని, దేవిశ్రీ ట్యూన్‌కు శింబు వాయిస్‌ తోడవడంతో చాలా బాగా వచ్చిందని చిత్ర బృందం తెలిపింది. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఇటీవల భారీ ఎత్తున ఇంటర్వెల్‌ సీన్‌తో పాటు నాయికానాయికలలపై ఓ పాట చిత్రీకరించాం అని నిర్మాత తెలిపారు. ఈ సినిమాకి సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా జులై 14న విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది.  లింగుస్వామి దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్‌, కెమెరా: సుజీత్‌ వాసుదేవ్‌.

Social Share Spread Message

Latest News