Namaste NRI

ప్రవాసులకు షాక్.. దుబాయ్‌లో రికార్డు స్థాయిలో

దుబాయ్‌లో  రికార్డు స్థాయిలో అద్దెలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 20శాతానికి పైగానే పెరిగినట్లు తెలుస్తోంది. జెబెల్ ఏరియాలో ట్రిపుల్ బెడ్ అపార్ట్‌మెంట్  వార్షిక అద్దె ఇంతకుముందు 70వేల దిర్హమ్స్ ఉండేది. ఇప్పుడు 84వేల దిర్హమ్స్‌కు  చేరింది. దుబాయ్ హిల్స్ వంటి కమ్యూనిటీలో ఈ పెరుగుదల అనేది 20శాతంగా నమోదైంది. దుబాయ్ మెరీనాలో 31శాతం, జుమేరా లేక్ టవర్స్ 16శాతం పెరిగాయి. అటు అద్దె పెరుగుదల సగటున 10 నుంచి 15శాతంగా ఉందని సారా హెవర్డిన్ తెలిపారు.  అపార్ట్‌మెంట్స్  బాటలోనే అటు విల్లాల ధరలు భారీగా పెరిగాయి. 2021తో పోలిస్తే 37శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, కొత్త రెసిడెన్సీ, వీసా విధానాలు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలుగా రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events