Skip to main content

Namaste NRI

గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు షాక్.. ఇంటర్వ్యూలకు వెళితే 

యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌)కు చెందిన శాన్‌ డియాగో కార్యాలయాల్లో గ్రీన్‌ కార్డ్‌ ఇంటర్వ్యూలకు వెళ్లిన వారిని అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీలు అరెస్ట్‌ చేస్తున్నాయి. వారికి బేడీలు వేస్తున్నాయి. అమెరికన్‌ పౌరుల భార్య/భర్తలకు కూడా ఈ పరిస్థితి తప్పడం లేదు. తన క్లయింట్‌ గ్రీన్‌ కార్డ్‌ ఇంటర్వ్యూకు వెళ్లినపుడు అరెస్ట్‌ చేసి, చేతులకు బేడీలు వేశారని ఓ న్యాయవాది చెప్పారు. ఇమిగ్రేషన్‌ అటార్నీ సమన్‌ నసేరీ మాట్లాడుతూ, వీసా గడువు మీరినప్పటికీ అమెరికాలో ఉంటున్న వారిని అరెస్ట్‌ చేయడం ఏజెన్సీలు ప్రారంభించాయన్నారు.

Social Share Spread Message

Latest News