రోజుకు లక్షపైగా కరోనా కేసులు నమోదవుతున్న అమెరికాలో మున్ముందు పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది. డెల్టా వేరియంట్ ఉధృతి నేపథ్యంలో రానున్న 4 వారాల్లో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతాయని సీడీసీ అంచనా వేసింది. సెప్టెంబరు 6 నాటికి రోజుకు 9,600`33,000కు పైగా కొవిడ్ ఆస్పత్రుల పాలవుతారని, సెప్టెంబరు 4 నాటికి మరణాల సంఖ్య 3,300`12,600 ఉండొచ్చని వివరించింది. ఇప్పటికే అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లో చేరికలు అధికంగా ఉన్నాయి. రోగులకు వైద్య సేవలు అందించడం క్లిష్టమవుతోంది.