Namaste NRI

ఎలన్‌ మస్క్‌ కు షాక్‌.. స్పేస్ ఎక్స్ రాకెట్ ప్ర‌యోగం విఫ‌లం

ఎలన్ మ‌స్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్ర‌యోగించిన అతిపెద్ద రాకెట్ ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. అమెరికా ద‌క్షిణ టెక్సాస్‌లోని బోకా చీకా తీరం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసిన కొద్దిసేప‌టికే రాకెట్ స్టార్‌షిప్ పేలిపోయింది. ఈ వ్యోమ‌నౌక రెండు సెక్ష‌న్లు,  బూస్ట‌ర్, స్పేస్ క్రాఫ్ట్ నిర్ణీత స‌మ‌యంలోగా విడిపోవాలి. రాకెట్ ప్ర‌యోగం విఫ‌ల‌మ‌వ‌డంతో బూస్ట‌ర్, స్పేస్ క్రాఫ్ట్ పేలిపోయిన‌ట్లు స్పేస్ ఎక్స్ సంస్థ తెలిపింది.

ఈ ప్ర‌యోగ ఫ‌లితాల‌ను త‌మ సైంటిస్టులు స‌మీక్షిస్తార‌ని ఎల‌న్ మ‌స్క్  తెలిపారు. ఇవాళ జ‌రిగిన వైఫ‌ల్యం నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నామ‌ని, మ‌రికొద్ది నెల‌ల్లో మ‌రో ప్ర‌యోగం చేప‌డుతామ‌ని మ‌స్క్ పేర్కొన్నారు. ఈ ప్ర‌యోగంలో పాలుపంచుకున్న సిబ్బందిని ఆయ‌న అభినందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events