ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో నల్ల సముద్రంలో ఉన్న రష్యా ప్రతిష్ఠాత్మక యుద్ధ నౌకపై క్షిపణితో దాడి చేసి ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. కాగా, అగ్ని ప్రమాదం వల్ల అందులోని క్షిపణులు పేలడంతో ఈ యుద్ధ నౌక మునిగినట్లు రష్కా పేర్కొంది. అయితే మాస్కోవా మునగడంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని రష్యాకు చెందిన ఒక టీవీ ఛానల్ సంచలన ప్రకటన చేసింది. నాటి సోవియట్ రిపబ్లిక్‌లో భాగమైన ఉక్రెయిన్ మైకోలైవ్‌లోని షిప్‌యార్డ్‌లో తయారైన ఈ యుద్ధ నౌక స్లావాగా 1979 జులైలో జలప్రవేశం చేసింది.
రష్యా ఆవిర్భవించిన తర్వాత రాజధాని మాస్కో పేరును సూచించేలా మాస్కోవాగా దీనికి పేరు పెట్టారు. అమెరికా, రష్యా, మధ్య ప్రచ్చన్న యుద్ధ సమయంలో ఇది కీలకంగా వ్యవహరించింది. జార్జియ, సిరియా, ఉక్రెయిన్ సంఘర్షణలో సేవలందించింది. 16 దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లే సమర్థ్యమున్న ఈ యుద్ధనౌక 611.5 అడుగలు పొడవు ఉంటుంది. 62 మంది అధికారులతో పాటు 476 మంది సిబ్బందిని కలిగి సుమారు 40 ఏండ్ల పాటు సేవలందించిన రష్యా యుద్ధ నౌక మాస్కోవా ఈ నెల 15న ధ్వంసమై నల్ల సముద్రంలో మునిగిపోయింది.














