Skip to main content

Namaste NRI

ఆ దేశంలో షట్‌డౌన్‌… విమాన రాకపోకల్లో తీవ్ర జాప్యం

అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్‌ లోకి వెళ్లిపోయాక ఆ దేశంలోని విమాన రాకపోకల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్ల కొరత కారణంగా యూఎస్‌ అంతటా దాదాపు 8 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే విమాన రాకపోకల్లో తీవ్ర జాప్యం, పలు సర్వీసుల రద్దు ఉంటుందని యూఎస్‌ రవాణా కార్యదర్శి సీన్‌ డఫ్ఫీ ట్రంప్‌ సర్కార్‌ను హెచ్చరించారు. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ అక్టోబర్‌ 1 నుంచి మొదలైంది. దీంతో కొన్ని అత్యవసర సేవల విభాగాలకు మినహా, మిగిలిన అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక నగరాల్లోని విమానాశ్రయాల్లో ఏటీసీ సిబ్బంది విధులకు హాజరుకావటం లేదు.

Social Share Spread Message

Latest News