Skip to main content

Namaste NRI

సిద్ధార్థ్ రాయ్ టీజర్ లాంచ్

బాలనటుడు దీపక్‌ సరోజ్‌ హీరోగా అరంగ్రేటం చేస్తున్న చిత్రం సిద్థార్థ్‌ రాయ్‌. వి.యశస్వి దర్శకుడు. జయ అడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌, ఫస్ట్‌-లుక్‌ పోస్టర్లు అందరినీ, ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా   సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. దర్శకులు శ్రీరామ్‌ ఆదిత్య, కార్తీక్‌ వర్మ దండు, నిర్మాత వంశీ , రైటర్‌ లక్ష్మీ భూపాల ఈ ఈవెంట్‌ కు అతిధులుగా హాజరయ్యారు.

టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ సిద్ధార్థ్‌ రాయ్ టీజర్‌ చాలా ఎఫెక్టివ్‌, ఇంపాక్ట్‌ ఫుల్‌గా వుంది. దీపక్‌ సరోజ్‌ చాలా అద్భుతంగా చేశాడు. ఇకపై తనని హీరోగా గుర్తుపెట్టుకుంటారు. తన్వి కూడా చక్కగా నటించింది. దర్శక, నిర్మాతలకు, చిత్ర యూనిట్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ప్రదీప్‌ పూడి ఇండిస్టీలో నాకు బ్రదర్‌ లాంటి వాడు. తను ఎదున్న మొహం మీదే చెప్పేస్తాడు. అలాంటిది ఇందులో భాగమైవున్నారంటే ఖచ్చితంగా సినిమా చాలా బావుందని నమ్ముతున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలి అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యువతను ఆకట్టుకునే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. పుట్టుకతోనే మేధావి అనిపించుకున్న ఓ యువకుడు ప్రతీ విషయాన్ని లాజిక్స్‌తో ఆలోచిస్తాడు. ఏ విషయంలో కూడా తనకు సాటి ఎవరూ లేరు అని భావించే అతను ప్రేమలో పడితే జరిగే పరిణామాలేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. సినిమా విడుదల తేదీని త్వరలో అనౌన్స్‌ చేస్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events