Namaste NRI

విరాట్‌రాజ్‌ హీరోగా ’సీతామనోహర శ్రీరాఘవ‘ ప్రారంభం

విరాట్‌రాజ్‌, రేవ జంటగా నటిస్తున్న చిత్రం సీతామనోహర శ్రీరాఘవ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.  ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్‌ రావిపూడి క్లాప్‌నిచ్చారు. ఏఏమ్‌ రత్నం కెమెరా స్విఛాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. పట్టణ, అటవీ ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది. రెగ్యులర్‌ లవ్‌స్టోరీస్‌కు  భిన్నంగా ఉంటుంది. నవంబర్‌ ప్రథమార్థంలో వైజాగ్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం అని తెలిపారు. పెద్ద తాతయ్య హరనాథ్‌ స్ఫూర్తితోనే సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నా. నటనకు సంబంధించి కృష్ణంరాజు నాకు చక్కటి సలహాలిచ్చారు అని విరాట్‌రాజ్‌ తెలిపారు. కృష్ణంరాజు సతీమణి శ్యామాల మాట్లాడుతూ కాలు ఫ్రాక్చర్‌ కావడం వల్ల కృష్ణంరాజు ఈ వేడుకకు రాలేదు. విరాట్‌ తప్పకుండా పెద్ద హీరో అవుతాడని ఆయన ఆశీర్వదించారు. ఇండస్ట్రీలో అడుడుపెట్టే కొత్తవారికి కృష్ణంరాజు, ప్రభాస్‌ ప్రోత్సాహం ఉంటుంది అని అన్నారు.  రవి బస్రూర్‌ సంగీతం, కింగ్‌ సోల్‌మన్‌ ఫైట్స్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రాన్ని దుర్గా శ్రీవాత్సవ దర్శకుడు. టి. సుధాకర్‌ నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News