Skip to main content

Namaste NRI

శివకార్తికేయన్ మదరాసి టైటిల్ గ్లింప్స్ విడుదల

శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం మదరాసి. రుక్మిణి వసంత్ కథానాయిక. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నది. శివకార్తీకేయన్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో పాటు యాక్షన్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇందులో శివకార్తీకేయన్ పూర్తి యాక్షన్ మోడ్లో కనిపించారు. విజువల్స్ ఆకట్టుకున్నాయి. అనిరుధ్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. విభిన్నమైన కథతో యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, శివకార్తికేయన్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Social Share Spread Message

Latest News