Namaste NRI

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. మొదటి సంతకం ఆ ఫైల్ పైనే

మా ( మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. నరేష్‌ నుంచి నూతన బాధ్యతలు తీసుకున్న విష్ణు నేటి నుంచి మా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అయితే ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే మా అధ్యక్షుడిగా తాను బాధ్యతలు తీసుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అనంతరం పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. మీ సమస్యలు నాకు తెలియజేయండి. మీ మద్దతు నాకు కావాలి అంటూ మంచు విష్ణు ట్విట్‌లో పేర్కొన్నారు.

                 ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఎప్పుడూ ఉంటుందనేది కూడా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. పెద్ద మనుషుల ద్వారా సర్ది చెప్పించి ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులను కలుపుకుపోతారా లేక మా బైలాస్‌కి అనుగుణంగా కొత్తవాళ్లని వారి ప్లేసుల్లో రిప్లేస్‌ చేస్తారా అన్నది చూడాలి.

Social Share Spread Message

Latest News