Skip to main content

Namaste NRI

శ్రీవిష్ణుచే ది ట్రయల్ ట్రైలర్ లాంచ్‌

ఆ రోజు రూప, ఆమె భర్త సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌ల ఫస్ట్‌ మ్యారేజ్‌ యానివర్సరీ. ఓ అపార్ట్‌మెంట్‌ మేడపై ఏకాంతంగా జరుపుకుంటున్నారు. ఇంతలో అనుకోకుండా అజయ్‌ కాలుజారి బిల్డింగ్‌పై నుంచి కిందపడి చనిపోయాడు. అది మీడియాలో పెద్ద న్యూస్‌ అయింది. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ మొదలైంది. రూపే తన భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ అనుమానించాడు. ఆమెను ఇంటరాగేట్‌ చేశాడు.

రూప మాత్రం తన భర్తది ఆత్మహత్యేనని గట్టిగా చెబుతుంది. ఇంతకీ అజయ్‌ది హత్యా? ఆత్మహత్యా? ఈ ప్రశ్నకు సమాధానంగా రూపొందిన చిత్రం ది ట్రయల్‌. స్పందన పల్లి, యుగ్‌రామ్‌, వంశీ కోటు ప్రధాన పాత్రధారులు. రామ్‌ గన్నీ దర్శకుడు. స్మృతి సాగి, శ్రీనివాసనాయుడు కిల్లాడ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీసాయికుమార్‌  దారా, సంగీతం: శరవణ వాసుదేవన్‌.

Social Share Spread Message

Latest News