Namaste NRI

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజీనామా

దేశం విడిచి వెళ్లిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఎట్టకేలకు  తన పదవికి రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి సింగపూర్‌ చేరుకున్న ఆయన అక్కడి తమ దేశ హైకమిషనర్‌ కార్యాలయం ద్వారా ఈమెయిల్‌లో ఆ లేఖను పార్లమెంటు స్పీకర్‌ మహింద అభయ్‌వర్ధనకు పంపించారు. ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్న రాజీనామా చట్ట బద్ధతను స్పీకర్‌ కార్యాలయం పరిశీలిస్తోంది. లేఖపై ఉన్న గొటబాయ సంతకాన్ని అలసు సంతకంతో పోల్చి చూడాల్సి ఉందని స్పీకర్‌ మీడియా కార్యదర్శి తెలిపారు. అన్ని అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత దీనిపై సాధికారికమైన ప్రకటన వెలువడుతుందనన్నారు.  గొటబాయ అసలు సంతకం ఉన్న పత్రాన్ని దౌత్యాధికారి ఒకరు సింగపూర్‌ నుంచి కొలంబోకు తీసుకువస్తారని వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events