Skip to main content

Namaste NRI

స్వర లయ ఆర్ట్స్‌ సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో  శ్రీగురు కళాంజలి

సింగపూర్‌లో గురు కళాంజలి కార్యక్రమం ఆధ్యంతం అద్వితీయంగా సాగింది. స్వర లయ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర లయ ఆర్ట్స్‌ విద్యార్థులైన బొమ్మకంటి అనన్య, షణ్మిత తంగప్పన్‌ ప్రార్థనాగీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలిండియా రేడియో ఆర్టిస్ట్‌ పప్పు పద్మా రవిశంకర్‌ వీణావాదనతో అందర్నీ మంత్రముగ్దుల్ని చేయగా, ఆమె తనయులు జ్ఞానదేవ్‌, జయదేవ్‌లు వయోలిన్‌, మృదంగ సహకారంతో సాగిన ఈ సంగీతరaురి మరింత రక్త కట్టింది. స్వర లయ ఆర్ట్స్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషు కుమారి మాట్లాడుతూ కళాకారుల ప్రదర్శనలతో పాటు, వారి గురువుల కళావిశిష్టత, వైవిధ్యం మొదలైన అంశాలపై చర్చలతో విజ్ఞానవంతముగా ముందుతరాలకు ఉపయుక్తంగా రూపొందించబడిరదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత సుధానిది గుమ్ములూరి శారద సుబ్రహ్మణం,  రాధిక నడదూరు, విద్యాధరి, సౌభాగ్యలక్ష్మి రాజశేఖర్‌, కవుటూరు లలితా రత్నకుమార్‌, బొమ్కకంటి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events