Skip to main content

Namaste NRI

ఆరేళ్ల విరామం తర్వాత .. మ‌ళ్లీ మొద‌లు!

సిక్కింలోని నాథూలా పాస్‌ ద్వారా సాగే భారత్‌-చైనా బహిరంగ వాణిజ్యం మ‌ళ్లీ మొద‌లు కాబోతున్న‌ది. ఆరేళ్ల విరామం అనంతరం ఆగస్టు 1 నుంచి తిరిగి వ్యాపారం ప్రారంభం కానున్న‌ది. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా 2020లో ఈ వాణిజ్య మార్గాన్ని మూసివేశారు. తర్వాత భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాని పునరుద్ధరణలో ప్రతిష్టంభన తలెత్తింది. అయితే ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణీకరణ దిశగా సాగుతున్న నేపథ్యంలో ఈ వాణిజ్య మార్గం మళ్లీ తెరుచుకోబోతున్న‌ది.

పురాతన కాలం నుంచీ ప్రపంచ ప్రధాన వాణిజ్య మార్గంగా నిలిచిన సిల్క్‌ రూట్‌లో భాగమైన నాథూలా కనుమను 1962లో భారత్‌-చైనా యుద్ధం అనంతరం మూసివేశారు. 2006లో పునఃప్రారంభించారు. ప్రస్తుతం దీన్ని తిరిగి ప్రారంభిస్తుండటం సిక్కింకు చెందిన వందల మంది స్థానిక వ్యాపారులకు, రవాణా సదుపాయాల నిర్వాహకులకు, అనుబంధ వ్యాపార కార్యకలాపాలకు ఎంతో మేలు చేయనుంది.

Social Share Spread Message

Latest News