Skip to main content

Namaste NRI

సుడిగాలి సుధీర్‌ కాలింగ్‌ సహస్ర..రిలీజ్ డేట్ ఫిక్స్

సుడిగాలి సుధీర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం కాలింగ్‌ సహస్ర. డాలీషా కథానాయిక.  అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వం. షాడో మీడియా ప్రొడక్షన్స్‌, రాధా ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ  చిత్రంలో శివ బాలాజీ, మనోహరన్‌ తదితరులు నటిస్తున్నారు.   ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన టీజర్‌, రెండు పాటలకు మంచి స్పందన లభించింది. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సుడిగాలి సుధీర్‌ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. సస్పెన్స్‌,  థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకుంటుంది. సహస్ర ఎవరు? ఆమె వెనకున్న రహస్యమేమిటన్నది కథలో ఆసక్తికరమైన అంశంగా ఉంటుంది అన్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 1న విడుదల చేయబోతున్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సన్నీ.డి, సంగీతం: మోహిత్‌ రెహమానియక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: మార్క్‌ కె రాబిన్‌, నిర్మాతలు: వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్‌ తయల్‌, చిరంజీవి పమిడి, దర్శకత్వం: అరుణ్‌ విక్కిరాలా.

Social Share Spread Message

Latest News