Skip to main content

Namaste NRI

సునీతా విలియమ్స్‌ రాక మరింత ఆలస్యం

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భూమికి తిరిగిరావడం మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 5న పది రోజుల మిషన్‌ భాగంగా మరో వ్యోమగామి విల్‌మోర్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 14న వారిద్దరు భూమికి తిరిగి రావాల్సి ఉన్నది. అయితే బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం నిలిచిపోయింది. దీంతో జూన్‌ 26న వారి తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) షెడ్యూల్‌ చేసింది. కానీ మరోసారి ల్యాండింగ్‌ వాయిదా పడింది. అయితే వారిద్దరు భూమిపైకి ఎప్పుడు వస్తారనే విషయమై నాసా ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Social Share Spread Message

Latest News