Skip to main content

Namaste NRI

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని యాక్షన్ మూవీ జాట్ డేట్ ఫిక్స్ 

బాలీవుడ్‌ అగ్ర హీరో సన్నీ డియోల్‌ నటిస్తున్న తాజా చిత్రం జాట్‌. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సన్నీ డియోల్‌ భుజంపై భారీ తుపాకీని మోస్తూ యాక్షన్‌ ప్యాక్డ్‌ అవతారంలో కనిపిస్తున్నారు.

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా ఇది. పోరాట ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయి. పుష్ప-2 చిత్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించిన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది అని మేకర్స్‌ తెలిపారు. రణదీప్‌ హూడా, వినీత్‌కుమార్‌ సింగ్‌, సయామీఖేర్‌, రెజీనా తదితరులు నటిస్తున్నారు.  ఏప్రిల్‌ 10న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. మరోవైపు సన్నీడియోల్‌ మొదటి తెలుగు సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, టీజీ విశ్వప్రసాద్‌, రచన-దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.

Social Share Spread Message

Latest News