Skip to main content

Namaste NRI

రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు షాక్

రాజకీయాల్లో నేరస్తులు పెరిగిపోవడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు సగం మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయపార్టీలూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన 48 గంటల్లోగా వారి నేర చరిత్రను వెల్లడిరచాల్సిందేనని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 13న ఇచ్చిన తీర్పులో మార్పులు చేసినట్టు పేర్కొంది. అభ్యర్థిత్వం ఖరారైన 48 గంటల్లోపు లేదా నామినేషన్‌ వేయడానికి 2 వారాల ముందు అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడిరచాలని గతంలో బీహార్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

                కాగా గత నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ఎక్కువైపోయారని జస్టిస్‌ నారీమన్‌ చెప్పారు. 2004లో 24 శాతం మంది అభ్యర్థులపై నేరచరిత్ర  ఉండగా.. 2009లో 30 శాతం, 2014లో 34 శాతం, 2019లో ఎన్నికల్లో 43 శాతం మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులున్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ కేసులన్నీ పెండిరగ్‌ లోనే ఉన్నాయన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events