అమెరికా మహిళల పుట్‌బాల్ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం చెందింది. అమెరికా స్వీడన్ మహిళలు 3`0తో గెలిచి ఈ గేమ్స్‌లో బోణీ కొట్టారు. అమెరికాకు గత 45 మ్యాచ్‌ల్లో ఇదే మొదటి ఓటమి కావడం విశేషం. టోక్యో స్టేడియంలో గ్రూప్ సి మ్యాచ్‌లో భాగంగా అమెరికా స్వీడన్ జట్లు తలపడ్డాయి. కరోనా నిబంధనల కారణంగా ప్రేక్షకులను అనుమతించలేదు. ఈ మ్యాచ్‌లో విజయంతో 2016 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి స్వీడన్ ఈ గేమ్స్‌లోనూ పతకం ఆశలను నిలుపుకొంది. స్వీడన్ జట్టులో స్టినా బ్లాక్ స్టెనియుస్ రెండు గోల్స్ చేయగా, లినా హుర్టిన్ ఒక గోల్ చేసింది. అమెరికా తన తదుపరి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. 2019 జనవరిలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓటమి తరువాత అమెరికాకు మళ్లీ ఇదే తొలి ఓటమి.