Skip to main content

Namaste NRI

ఛార్లెట్‌ లో తానా బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమం విజయవంతం … 300 మందికి పైగా పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతి ఏటా బ్యాక్‌ప్యాక్‌ పేరిట చిన్నారులకు స్కూల్‌ బ్యాగ్‌లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమను ఆదరించిన అమెరికాలోని కమ్యూనిటీకి తమవంతుగా సేవలందించా లన్న ఉద్దేశ్యంతో తానా ఈ బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమాన్ని తానా నాయకులు చేపట్టారు. ఛార్లెట్‌లో ఆగస్టు 22వ తేదీన క్లియర్‌ క్రీక్‌ ఎలిమెంటరీ స్కూల్‌లోని పేద పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌ లను పంపిణీ చేశారు. బ్రన్స్‌ ఎవెన్యూ ఎలిమెంటరీ స్కూల్‌ లోని పిల్లలకు కూడా స్కూల్‌ బ్యాగ్‌ లను అందజేశారు. ఈ బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమం కింద దాదాపు 300కు పైగా బ్యాగ్‌ లను పిల్లలకు అందజేశారు. ఇందులో క్రేయాన్స్‌, ఎరేజర్స్‌, పెన్సిల్‌, షార్పనర్స్‌, పెన్నులు తదితర వస్తువులను కూడా కలిపి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఛార్లెట్‌ లోని తానా నాయకులు పలువురు పాల్గొన్నారు. తానా స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ నాగమల్లేశ్వర పంచుమర్తి, తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఠాగూర్‌ మల్లినేని, తానా టీమ్‌ స్క్వేర్‌ చైర్మన్‌ కిరణ్‌ కొత్తపల్లి, పట్టాభి కంఠమనేని, రమణ అన్నే, సతీష్ నాగభైరవ, పార్ధ సారధి గునిచెట్టి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా స్కూల్‌ నిర్వాహకులు, టీచర్లు మాట్లాడుతూ, తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాల ను ప్రశంసించారు. తానా బ్యాక్‌ ప్యాక్‌ కింద తమ స్కూల్‌ ను ఎంపిక చేసుకుని పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌ లను పంపిణీ చేసినందుకు వారు స్థానిక తానా నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. పిల్లల తల్లితండ్రులు కూడా తానాకు తమ అభినందనలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events