Skip to main content

Namaste NRI

పాయల్ రాజ్‌పుత్, అనసూయ చేతుల మీదుగా తంత్ర ఫస్ట్ సాంగ్ లాంచ్

అనన్య నాగళ్ల, ధనుష్‌ రఘుముద్రి, సలోని, టెంపర్‌ వంశీ, మీసాల లక్ష్మణ్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా తంత్ర. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బీ ద వే ఫిల్మ్స్‌, వైజాగ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై చిత్రీకరించిన ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌, అనసూయ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన అనురాగ్‌ కులకర్ణి గారు ఈ సాంగ్‌ పాడటం చాలా ప్లస్‌ అయింది. టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తంత్ర రహస్యమేమిటన్నది ఉత్కంఠ ను పంచుతుంది. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. త్వరలో ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తాం అన్నారు. ఈ సినిమాకు కెమెరా: సాయిరాం ఉదయ్‌, విజయ్‌ భాస్కర్‌ సద్దాల; సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌; సాహిత్యం: అలరాజు; నిర్మాతలు: నరేశ్‌బాబు పి, రవిచైతన్య; రచన-దర్శకతం: శ్రీనివాస్‌ గోపిశెట్టి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events