Skip to main content

Namaste NRI

తరుణ్ భాస్కర్ కీడా కోలా రిలీజ్ డేట్ ఫిక్స్  

దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం కీడా కోలా. కె.వివేక్‌ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ నండూరి, శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్రవర్మ నిర్మాతలు. దగ్గుబాటి రానా సమర్పిస్తున్నారు.  ఈ సందర్భంగా బ్రహ్మానందం, తరుణ్‌భాస్కర్‌, చైతన్యరావు ప్రధాన తారాగణమంతా సీరియస్‌ లుక్స్‌లో ఉన్న రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. రెండున్నరగంటలపాటు నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేసే సినిమా ఇదని దర్శక,నిర్మాతలు చెప్పారు. ఈ  చిత్రంలో  రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌కుమార్‌, విష్ణు, రాగ్‌ మయూర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఏజే ఆరోన్‌, సంగీతం: వివేక్‌ సాగర్‌, నిర్మాణం: వి.జి.సైన్మ.

Social Share Spread Message

Latest News