Skip to main content

Namaste NRI

ఛార్లెట్‌ లో టీమ్‌ కొడాలి ప్రచారం

ప్రస్తుత తానా ఎన్నికల్లో ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేన్‌ కొడాలి, ఆయనతోపాటు ఆయన టీమ్‌ ఛార్లెట్‌లో ప్రత్యక్ష ప్రచారాన్ని నిర్వహించింది. స్థానిక ఛార్లెట్‌ టీమ్‌ నాయకులు పురుషోత్తమ చౌదరి గూడె, నాగ పంచుమర్తి, ఠాగూర్‌ మల్లినేని ఈ ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాబోయే అధ్యక్ష అభ్యర్థి నరేన్‌ కొడాలి, ప్రసాద్‌ నల్లూరి, శ్రీని లావు, ఉమ కటికి, శ్రీనివాస కూకట్ల, జాని నిమ్మలపూడి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నరేన్‌ టీమ్‌ను గెలిపించాల్సిందిగా కోరారు. మదర్స్‌ డే ను పురస్కరించుకుని తానా మహిళల చేత కేక్‌ కట్‌ చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఛార్లెట్‌కు చెందిన అభ్యర్థులను పరిచయం చేస్తున్నప్పుడు వారిని గెలిపిస్తే తానాకు వారు చేయనున్న సేవలను అంజయ్య చౌదరిలావు, నరేన్‌ కొడాలి తెలియజేశారు. మిగతా అభ్యర్థులను కూడా గెలిపించాల్సిందిగా వారు కోరారు.

Social Share Spread Message

Latest News