Skip to main content

Namaste NRI

మేఘాంశ్ శ్రీహరి స్టూడెంట్ మూవీ టీజర్ రిలీజ్

మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా నటిస్తున్న చిత్రం స్టూడెంట్‌. విజేత పరీక్‌ కథానాయిక. బాలు తత్వమసి దర్శకుడు. బెల్లం సిద్ధారెడ్డి నిర్మాత. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. టీజర్‌ ఆద్యంతం కాలేజ్‌ పాలిటిక్స్‌ నేపథ్యంలో సాగింది. పక్కనోడు కత్తితో యుద్ధం చేస్తున్నప్పుడు మనం చెయ్యి పెడితే తెగిపోద్ది.. మనం పాలిటిక్స్‌లో ఉన్నాం.. ఇక్కడ ఎథిక్స్‌ ఉండవ్‌.. ఓన్లీ ట్రిక్సే ఉంటాయి అంటూ టీజర్‌లో హీరో చెప్పే డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో స్టూడెంట్‌ లీడర్‌ భానుగా మేఘాంశ్‌ శ్రీహరి కనిపించారు. రాజకీయాలు, ప్రేమ, గొడవల నేపథ్యంలో ఆసక్తికరంగా టీజర్‌ సాగింది. త్వరలో సినిమా విడుదల కానున్నది. శుభలేఖ సుధాకర్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్‌ బెజుగం, సంగీతం: ప్రేమ్‌చంద్‌ కంచర్ల.

Social Share Spread Message

Latest News