Namaste NRI

దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. రాధారపు సతీశ్ కుమార్

తెలంగాణలో నిరుపేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ అన్నారు. బహ్రెయిన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సతీశ్ కుమార్ కట్ చేసి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తుందన్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ జెండాను లండన్ తరువాత బహ్రెయిన్‌లో ఎగురవేసి కేసీఆర్ వెంట నడిచామని తెలిపారు. అదే స్ఫూర్తితో నేడు దేశంలో గుణాత్మక మార్పుకోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండాను సైతం బహ్రెయిన్‌లో కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఆవిష్కరించడం గర్వాంగా ఉందన్నారు. బహ్రెయిన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు పార్టీలో చేరి కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నారని చెప్పారు.  రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేడు దేశ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, సంగేపోలు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, బీఆర్ఎస్ నాయుకులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events