మల్లేశం, వకీల్ సాబ్, మ్యాస్ట్రో వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన తెలుగు నటి అనన్య నాగళ్ల. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం చిత్రంలో కీలక పాత్ర పోషించింది. వకీల్‌సాబ్ సినిమాలో కీలకపాత్రలో నటించే అవకాశం వచ్చింది. వకీల్ సాబ్ సినిమాతో అనన్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఏడాదికి ఒకటీ రెండు సినిమాలతో బిజీగా గడుపుతున్న అనన్య తాజాగా తమిళ ఎంట్రీకి ముస్తాబవుతుంది. తమిళ హీరో శశికుమార్ ప్రధాన పాత్రలో అంజల్ అనే చిత్రం తెరకెక్కనుంది. తంగం పా.శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఇ.మోహన్ నిర్మాత. దక్షిణ భారతదేశమంతా ప్రయాణించే ఓ ట్రావెలర్ కథతో రూపొందుతోంది. ఇప్పుడిరదులో శశికుమార్‌కు జోడీగా అనన్య కనిపించనుంది. ఈ సినిమా త్వరలో సైట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.














