Skip to main content

Namaste NRI

నవంబర్ 14న టీఎఫ్ సీసీ ఎన్నికలు

తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయింది. నవంబరు 14న ఎన్నికలు జరగనున్నాయి. టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామృకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ టీఎఫ్‌సీసీ స్థాపించి ఏడేళ్లు పూర్తయింది. మా చాంబర్‌ 8000 మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 మంది తెలంగాణ మూవీ ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ ప్రస్తుత కమిటీ గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నాం. నవంబరు 14నే తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేసన్‌ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆసక్తిగల  వారు పోటీ చేయవచ్చు అన్నారు. ఉపాధ్యక్షుడు ఎత్తరి గురురాజ్‌ మాట్లాడుతూ టీఎఫ్‌సీసీ ప్రారంభమై ఏడేళ్లలో 800 మంది సభ్యులుగా చేరడం సాధారణమైన విషయం కాదన్నారు. టీఎఫ్‌సీసీ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాం అని  తెలిపారు.

Social Share Spread Message

Latest News