Skip to main content

Namaste NRI

మా సినిమాను ఆద‌రిస్తోన్న ప్రేక్షకుల‌కు ధ‌న్యవాదాలు .. గుణశేఖర్‌

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ రూపొందిన యుఫోరియా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. భూమిక, సారా అర్జున్‌, నాజర్‌, రోహిత్‌, విఘ్నేష్‌ గవిరెడ్డి కీలక పాత్రధారులు. సక్సెస్‌మీట్‌లో గుణశేఖర్‌ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని ప్రయత్నించాను. అందుకు తగిన ఫలితం లభిస్తున్నది. పేరెంటింగ్‌, సోషల్‌ ఇంపాక్ట్‌ అనే అంశాలను రియలిస్టిక్‌గా చూపించారని ప్రశంసలొస్తున్నాయి అని అన్నారు.

ఎలాంటి ఫార్ములాని ఫాలో కాకుండా హర్‌ ్డహిట్టింగ్‌గా ఈ కథను చెప్పాలనుకున్నామని, ఇటీవల కాలంలో ఇలాంటి ైక్లెమాక్స్‌ చూడలేదని అంటున్నారని, అన్ని కేంద్రాల్లో పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభిస్తున్నదని గుణశేఖర్‌ తెలిపారు. తల్లీ కొడుకు మధ్య సంఘర్షణను హృదయానికి హత్తుకునేలా చూపించారని ప్రశంసలొస్తున్నాయని, భూమిక నటన హైలైట్‌గా నిలుస్తున్నదని నీలిమ గుణ చెప్పారు.

Social Share Spread Message

Latest News